Homeఆంధ్ర ప్రదేశ్లోక్ స‌భ డిప్యూటీ స్పీకర్ గా చిన్నమ్మ...!

లోక్ స‌భ డిప్యూటీ స్పీకర్ గా చిన్నమ్మ…!

  • పురందేశ్వరికి అరుదైన ఛాన్స్

  • చంద్రబాబు సైతం సానుకూలం

  • త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీకి మరో జాతీయస్థాయి పదవి రానుందా? లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఏపీకి కేటాయించనున్నారా? ఎంపీ పురందేశ్వరికి ఆ పదవి కట్టబెట్టనున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చ ప్రారంభం అయింది. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎట్టకేలకు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ పదవిలో ఏపీకి చెందిన మహిళ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కూర్చోబెడతారని ప్రచారం నడుస్తోంది. కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న పురందేశ్వరి విషయంలో కేంద్ర పెద్దల ఆలోచన మారినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీకి అరుదైన గౌరవం దక్కినట్టే.

గత కొన్నేళ్లుగా పదవి ఖాళీ…

ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పోస్టును భర్తీ చేయలేదు. వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ పోస్టును ప్రతిపక్షానికి కేటాయించాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక నాయకుడిని భర్తీ చేయాలి. కానీ రాజకీయ కారణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆ పదవి ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో గత కొంతకాలంగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. లోక్సభ స్పీకర్ లేని సమయంలో ప్యానల్ స్పీకర్ తో నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి ఎంపీ తోనే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టును భర్తీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమెకే ఛాన్స్…

ఏపీ నుంచి మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరికి ఈ చాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో బిజెపి తరఫున రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు పురందేశ్వరి. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ మూడు పార్టీల పొత్తుకు ఆమె కృషి చేశారు. అయితే ఎంపీగా గెలవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కేంద్ర మంత్రి పదవి కోసమే ఆమెతో రాష్ట్ర అధ్యక్ష పదవి రాజీనామా చేయించారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఇంతలో ఆమె పేరు జాతీయ అధ్యక్ష పదవికి వినిపించింది. కేంద్ర మంత్రి పదవికి వినిపించింది.

ఇవేవీ జరగలేదు. అందుకే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కోసం ఆమె పేరును ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఆమె విషయంలో సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే చిన్నమ్మకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాయమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని విభేదించి భర్తతో పాటు కాంగ్రెస్లో చేరిన ఆమె 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తరువాత కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు.. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి సుదీర్ఘకాలం పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే ఆమెకు అరుదైన గౌరవం దక్కినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు