Homeతెలంగాణఅరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

  • అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

  • నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు

నాంపల్లి(క్రైమ్ మిర్రర్): రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా, నాంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దూది రాజు స్థానిక ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

వాహనదారులు తమ వెంట ఎప్పుడూ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు, వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే సకాలంలో ఇన్సూరెన్స్‌లను పునరుద్ధరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేసే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం వంటివి అత్యంత ప్రమాదకరమని, ఇవే ప్రధానంగా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు..

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ, తమ కోసం ఇంట్లో వేచి చూసే కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. సమాజ రక్షణలో భాగంగా తమ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డితో పాటు, పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు