క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణా ఉపముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిపిన చర్చల అనంతరం, విద్యుత్ ఆర్టిజన్లు తమ సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఆర్టిజన్ల జేఏసీ (JAC) నాయకులు డిప్యూటీ సీఎంను కలిశారు. ఆర్టిజన్ల సమస్యలపై చర్చించేందుకు ట్రాన్స్‌కో (TRANSCO) సీఎండీ కృష్ణ భాస్కర్‌కు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టిజన్ల డిమాండ్లను మానవీయ కోణంలో పరిశీలిస్తామని, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సానుకూల హామీల నేపథ్యంలో, సమ్మెను వెంటనే విరమిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, కన్వీనర్ సాయిలు ప్రకటించారు.
