క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఈరోజు చాలా కీలకం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా కోల్కతా గెలవలేదు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు మ్యాచ్లో మొదటి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్లు పట్టికలో ముందుకు వెళుతూ ఉంది. కానీ కోల్కత్తా జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకటి వర్షం కారణంగా రద్దవ్వగా మిగతా మూడు మ్యాచ్లలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. రహానేకి కెప్టెన్సీలో మొట్టమొదటిసారి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో ఇవాళ జరగబోయేటువంటి కీలక పోరులో కోల్కత్తా ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కనిపిస్తుంది. మరోవైపు గుజరాత్ జట్టులో కెప్టెన్ గిల్, బట్లర్, రషీద్ ఖాన్ మరియు ప్రసిద్ కృష్ణ వంటి ఆటగాళ్లు భీకరమైన ఫామ్ లో ఉండడం గుజరాత్కు కలిసి వచ్చే అవకాశం. దీంతో ఈరోజు జరగబోయేటువంటి ఈ కీలక పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇరాన్‌తో డీల్ కుదిరింది…! ట్రంప్…
Samantha: తస్సాదియ్యా అంటున్న సమంత… అక్కినేని ఫ్యామిలీ బాటలో…!
