Homeఅంతర్జాతీయంఅమెరికాకు ఇరాన్ స్ర్టాంగ్ వార్నింగ్... శ‌త్రువులు ఏ పొర‌పాటు చేసిన ధ్వంస‌మే...!

అమెరికాకు ఇరాన్ స్ర్టాంగ్ వార్నింగ్… శ‌త్రువులు ఏ పొర‌పాటు చేసిన ధ్వంస‌మే…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హ‌ర్మూజ్‌ను దిగ్బంధిస్తామ‌ని హెచ్చ‌రించిన వేళ ఇరాన్ ఘాటుగా బ‌దిలిచ్చింది. హార్మూజ్ ఇప్ప‌టికీ త‌మ నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని పేర్కొంది. శ‌త్రువులు ఏ వైపు నుంచి వ‌చ్చిన త‌ప్పించుకోలేర‌ని హెచ్చ‌రించింది. అంతకుముందు ఇరాన్ సైనిక దళం (ఐఆర్‌జీసీ) కూడా ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. హోర్ముజ్ వైపు వచ్చే యుద్ధ నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించింది. పౌర నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇచ్చింది. యుద్ధ నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌లో అమెరికాతో చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంపై ఇరాన్ మంత్రి అరాగ్చీ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 47 ఏళ్ల తరువాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలకు తాము సదుద్దేశంతో వెళ్లామని చెప్పారు. ఒప్పందం విష‌యంలో యుఎస్ త‌న మ‌న‌స్సు మార్చ‌కుంద‌ని ఆరోపించారు. మునుపటి అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలను అమెరికా నేర్చుకోలేదని అన్నారు. మంచి భావాలుంటే చివరకు మంచే జరుగుతుందని అన్నారు. మనసులో శత్రుత్వం ఉంటే తుదకు అదే మిగులుతుందని పోస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు