Homeతెలంగాణతెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్.!? పునరాలోచనలో కెసిఆర్, కేటీఆర్

తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్.!? పునరాలోచనలో కెసిఆర్, కేటీఆర్

  • భారత రాష్ట్ర సమితి పేరు మార్పుతో ఓటమి

  • తాజాగా కవిత పాత పార్టీ పునరుద్ధరణకు ప్రయత్నాలు

  • అందుకే పాత పార్టీ వైపు మొగ్గు చూపుతున్న గులాబీ పార్టీ నాయకత్వం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ పార్టీ గుణపాఠం నేర్చుకుందా? వైఫల్యాలను గుర్తించిందా? వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుందా? ఉద్యమ తెలంగాణ నాటి పరిస్థితులను మళ్లీ తేవాలని భావిస్తోందా? ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటును మళ్లీ తెరపైకి తేనుందా?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం అందుకు బలం చేకూరుస్తోంది. చాలా రకాల వైఫల్యాలను, పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలను కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. అవే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

  • టిడిపిని విభేదించి టిఆర్ఎస్

తెలుగుదేశం పార్టీని విభేదించి ప్రత్యేక రాష్ట్రం దిశగా అడుగులు వేశారు కేసీఆర్. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆకాంక్షించే వారిని ఆకర్షించగలిగారు. అలా ప్రత్యేక ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కెసిఆర్. 2001 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని తీర్చిదిద్దగలిగారు కేసీఆర్. ఈ క్రమంలో ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకానొక దశలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటి పరిస్థితులు కెసిఆర్ పార్టీకి కలిసి వచ్చేలా చేశాయి. అలా 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టిఆర్ఎస్ను గుర్తించారు తెలంగాణ ప్రజలు. అందుకే రెండుసార్లు ఆ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే తన తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా తీర్చిదిద్దే క్రమంలో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారో అప్పటినుంచి కెసిఆర్ కు కష్టాలు మొదలయ్యాయి.

  • జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితి..

జాతీయ రాజకీయాలను శాసించాలని భావించారు కేసీఆర్. అందుకే తన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపిని వ్యతిరేకించారు. అయితే ఆ మరుక్షణం తెలంగాణ సమాజం కూడా ఉద్యమ టిఆర్ఎస్ను మరిచిపోయింది. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ పార్టీని మరిచిపోయింది. ఉద్యమ తెలంగాణ గా ఉన్నంతవరకు టిఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాలను శాసించాలన్న కెసిఆర్ ఆలోచనను వ్యతిరేకించారు. అయితే తాజాగా తన తండ్రి పార్టీతో విభేదించిన కవిత టిఆర్ఎస్ ను పునరుద్ధరించాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం తెలంగాణ ప్రజా జాగృతి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిని పునరుద్ధరిస్తామని సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంలో కెసిఆర్ అనుమతి తీసుకుని అడుగులు వేస్తామని చెప్పారు. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం మరోసారి టిఆర్ఎస్ తెరపైకి రావడం ఖాయం అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…

ఇవి కూడా చదవండి ….

  1. రేపు ఉదయం 11 గంటలకు.. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

  2. తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్…!

  3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వేడెక్కిన రాజ‌కీయం…ఇద్ద‌రు నేత‌లు మాట‌ల యుద్దం…!

  4. ఆపరేషన్ ఐలాపూర్…6 అంత‌స్తుల భ‌వ‌నం నేల‌మ‌ట్టం…!

  5. పెరగనున్న లిక్కర్ ధరలు.! పెంచే యోచనలో తెలంగాణ సర్కార్

  6. Big breaking: ఆప‌రేష‌న్ ఖ‌గార్ ఎఫెక్ట్‌…మ‌రో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు