విజయవాడ, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్ రిటైర్డ్ డైరెక్టర్ వి రంగరాజ్ ఉద్యోగానికి సంబంధించి ఆసక్తికర పరిణామం జరిగింది. వి రంగరాజ్ జూన్ 30న పదవీ విరమణ చేయగా.. ఆయన్ను మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వి రంగరాజ్‌కు 60 ఏళ్లు నిండటంతో నిబంధనల ప్రకారం గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల రెగ్యులర్ ఉద్యోగుల (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్ 9, 10 పరిధిలోకి వస్తారు) పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తాయని తెలిపింది.ఏపీ ఆర్కైవ్స్ విభాగం కూడా ఈ పదో షెడ్యూల్ పరిధిలోకి వస్తుంది.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
Also Read:ఏపీ విద్యార్థులకు శుభవార్త: ఈ నెల 24లోగా తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నిధులు!
రంగరాజ్ ఈ నెల 2న ఈ నిబంధనల ప్రకారం తనకు 62 ఏళ్ల వరకు సర్వీసు పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వానికి జాయినింగ్ రిపోర్టు సమర్పించారు. వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆయన్ను తిరిగి విధుల్లోకి చేర్చుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద రంగరాజ్ మరో రెండేళ్ల పాటూ తన ఉద్యోగంలో కొనసాగనున్నారు. రంగరాజ్‌లాగే మరికొందరు కూడా తిరిగి వారి పోస్టుల్లో చేరనున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 2022లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారు. తమకు కూడా పదవీ విరమణ వయసును పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా.. అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల డిమాండ్‌పై అధ్యయనం చేసేందుకు మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణలతోప్రభుత్వం కమిటీ వేసిన సంగతి తెలిసిందే.. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై పదవీ విరమణ వయసు పెంపుపై చర్చించింది.
Also Read:నవంబర్ 19న ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభం.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన!
ఈ మేరకు అన్ని అంశాలను పరిశీలించి పదవీ విరమణ వయసు పెంచడానికి కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ఫైల్ ఏపీ కేబినెట్ ముందుకు వెళ్లగా.. చర్చించి ఆమోదించారు.. ఈ నెల మొదటి వారంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు పదవీ విమరణ చేసి ఉంటే వారిని తిరిగి విధుల్లోకి తీసుకుని 62 ఏళ్ల వవరకు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించి.. ఈ మేరకు రంగరాజ్ విధుల్లో చేరారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 15 వేల మందికి పైగా ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.