Homeక్రైమ్స్నాక్స్ కోసం బైక్ ఇవ్వలేదని దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని బీర్ సీసాలతో కొట్టి హత్య

స్నాక్స్ కోసం బైక్ ఇవ్వలేదని దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని బీర్ సీసాలతో కొట్టి హత్య

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న కారణంతో మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మద్యం తాగేందుకు స్నాక్స్ తీసుకురావడానికి బైక్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు దారుణంగా హతమార్చారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మదిరె గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు (36) కొంతకాలంగా తిరుపతిలో నివాసం ఉంటూ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 9న జాతీయ రహదారి సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో శ్రీనివాసులు మద్యం సేవిస్తున్నారు.
అదే సమయంలో ఓటేరుకు చెందిన ఆకాశ్ (24), రాఘవేంద్ర (20) అక్కడికి మద్యం తీసుకుని వచ్చారు.

స్నాక్స్ తీసుకురావడానికి శ్రీనివాసులును బైక్ ఇవ్వాలని కోరారు. అయితే ఆయన బైక్ ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఇద్దరు యువకులు బీర్ సీసాలతో శ్రీనివాసులుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. చిన్న వివాదం కారణంగా జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

also read: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం… ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు