కాకినాడ జిల్లా గొల్లప్రోలులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ కౌన్సిలర్ సంధ్య భర్త అర్జున్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా నివాసం ఉండే బచ్చల కళ్యాణ్ లింగం అనే వ్యక్తి అర్జున్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అర్జున్ తీవ్రంగా గాయపడగా, వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
also read: దేవుడికి హారతి ఇస్తుండగానే గుండెపోటు… ఆలయంలోనే కుప్పకూలిన ప్రధాన అర్చకుడు