Homeతెలంగాణపెరగనున్న లిక్కర్ ధరలు.! పెంచే యోచనలో తెలంగాణ సర్కార్

పెరగనున్న లిక్కర్ ధరలు.! పెంచే యోచనలో తెలంగాణ సర్కార్

  • గత ఏడాదితో ముగిసిన గడువు

  • అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటు

  • వచ్చే నెలలోనే పెంపు నిర్ణయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మద్యం ధరల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో మద్యం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి ధరలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడు ఉన్న ధరలపై 12 నుంచి 15% వరకు పెంచాలని కంపెనీలు ప్రతిపాదనలు పంపాయి. దానిపై కమిటీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే బీర్ల ధరలను ప్రభుత్వం పెంచింది. మళ్లీ ఇప్పుడు లిక్కర్ ధరలను పెంచాలని భావిస్తుంది. లిక్కర్ ధరలను పెంచే నిబంధన ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉందని.. కానీ తెలంగాణలో పెంచి మూడేళ్లు అవుతోందని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా ధరల పెంపు ఉంటుందని సంకేతాలు పంపింది.

  • మందుబాబులపై భారం..

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే వేసవిలో మందుబాబులపై అదనపు భారం పడుతుందని తేలింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు.. రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం గత ఏడాది వేసవిలోని సమీక్ష జరపాలి. మద్యం ధరలను పెంచాల్సి ఉంది. అందుకే మూడు సంవత్సరాలు అవుతున్న దృష్ట్యా మద్యం ధరల పెంపు అనివార్యంగా మారింది.

  • యుద్ధం నేపథ్యంలో..

పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సహజ వాయువు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం సహజ వాయువు కొరత వల్ల గాజు సీసా తయారీ యూనిట్లో ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40 శాతం పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని.. వెంటనే మద్యం ధరలు పెంచాలని డిక్షనరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అందుకే నాకు ప్రభుత్వం ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

  • ప్రత్యేక కమిటీ ఏర్పాటు..

ప్రభుత్వం ఓ రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరల పెంపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఈ పెంపును ఐదు స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశం ఉంది. అయితే అన్నింటికీ మించి బీర్ల ధరలు మరోసారి పెరగనుండడంతో వేసవిలో మందుబాబులపై భారం తప్పేలా లేదు.

ఇవి కూడా చదవండి ….

  1. రేపు ఉదయం 11 గంటలకు.. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

  2. తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్…!

  3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వేడెక్కిన రాజ‌కీయం…ఇద్ద‌రు నేత‌లు మాట‌ల యుద్దం…!

  4. ఆపరేషన్ ఐలాపూర్…6 అంత‌స్తుల భ‌వ‌నం నేల‌మ‌ట్టం…!

  5. చిరకాల శత్రువు చెంతకు జీవన్ రెడ్డి.!

  6. Big breaking: ఆప‌రేష‌న్ ఖ‌గార్ ఎఫెక్ట్‌…మ‌రో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు