హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ విజయవంతమైంది. వరుసగా మావోయిస్టులు పెద్ద ఎత్తున సరేండర్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులు ఎదుట భారీ ఎత్తున మవోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు నేత, పీపుల్స్ లిబరేషన్ గరెల్లా డిప్యూటి కమాండర్ సోడిమల్ల కేశాలు తో పాటు మొత్త 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల నుంచి వీరంతా వచ్చి లొంగిపోతున్నట్లు ప్రకటించారు. వీరిని సరిహద్దుల వెంట పోలీసు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు.
అనంతరం సరిహద్దుల నుంచి పోలీసులు వీరిని వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. మావోయిస్టు నేత హిడ్మా PLGAను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవాకు, కేశాలుకు అప్పగించారు. అయితే, కొన్ని రోజులు కిందటే PLGA కమాండర్ దేవా.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుపోయారు. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సోడిమల్ల కేశాలు సైతం నేడు లొంగిపోయారు. ఇతనికి సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున
గెరెల్లా ఆర్మీ కనుమరుగు…డీజీపీ
మావోయిస్టుల లొంగిపోయిన సందర్భంగా రాష్ర్ట డీజీపీ శివదర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ రోజు మొత్తం 42 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన పేర్కొన్నరారు. ఎల్‌పీజీఏ బెటాలియన్ కమాండర్‌గా పని చేస్తున్న సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలు, తూటాలతో సహా 800 గ్రాముల బంగారం అప్పగించి సరేండర్ అయ్యారు. 36 తుపాకాలు, ఐదు ఏకే 47లు, నాలుగు ఎస్ ఎల్ార్‌లు, 1007 తూటాలు అప్పగించినట్లు తెలిపారు. వీరి లొంగుబాటులో పీపుల్స్ లిబరేషన్ గెరెల్లా ఆర్మీ పూర్తిగా లొంగిపోయిందని పేర్కొన్నారు.
