Homeక్రైమ్ఉదయసముద్రం నుండి మునుగోడుకు నీరు అందించాలి ...!

ఉదయసముద్రం నుండి మునుగోడుకు నీరు అందించాలి …!

  • బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం

మునుగోడు క్రైమ్ మిర్రర్: మునుగోడుకు నీరు అందించలేని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలని మండల కేంద్రంలోనీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మందుల సత్యం డిమాండ్ చేశారు.ఎలక్షన్ల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని స్వంత డబ్బులతోనే చేస్తానని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయకపోవడం దురదృష్టకరం అన్నారు.

శివన్నగూడెం ప్రాజెక్ట్ నుండి మునుగోడుకు నీళ్లు అందించలేని రాజ గోపాల్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.పగిళ్ల సతీష్,మదనబోయిన పరమేష్ యాదవ్,నన్నూరి భూపతి రెడ్డి,పొలగొని సైదులు గౌడ్,గజ్జల బాలరాజ్,జంగిలి సాంబయ్య,,మారగోని అంజయ్య,జిట్టగొని మల్లేష్,నల్లగొండ అంజి,గుర్రాల సురేష్,లోకేష్, కరుణాకర్, సురేష్,రాంబాబు, యాదగిరి, నరసింహ,ప్రవీణ్,వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments