హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను సోమవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలించేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముంబై టు హైదరాబాద్‌కు ఈ ముఠా తరలిస్తున్న సింథటిక్ డ్రగ్(కొకైన్)ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
పోలీసులకు కంఠపడకుండా ఈ ముఠా నగరంలోని ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఇళ్లలో పని చేసే డ్రైవర్లను, వంటమనుషులను తమ ఏజెంట్లుగా వాడుకుంటోంది. ప్రముఖుల వాహనాలకు పోలీసుల తనిఖీల నుంచి కొంత మినహాయింపు ఉంటుందనే నమ్మకంతో ఆ కార్లను, సిబ్బందిని ఉపయోగించి డ్రగ్స్ డెలివరీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. గత కొన్ని రోజులుగా నగరంలో డ్రగ్ పె్లర్లపై నిఘా ఉంచిన టాస్క్‌ఫోర్స్ ఈ పక్కాగా ఈ దాడులు నిర్వహించి ఇద్దరు ప్రధాన పెడ్లర్లతో పాటు ముగ్గురు డ్రైవవర్లను, ఒక వంట మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుండి భారీ మొత్తంలో డ్రగ్స్, ఐదు మొబైల్ ఫోన్లు మరియు ఒక లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా ముంబై నుండి వస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌లో లోకల్ నెట్‌వర్క్ లోగుతుంగా ఉందని, ప్రముఖుల పేర్లు బయటకు రాకుండా వారి సిబ్బందిని వాడుకోవడం అందోళనకరంగా ఉందని, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేసింది? కొనుగోలుదారుల జాబితాలో ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రాబోయే గంటల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
