Homeసినిమారేణూ దేశాయ్‌పై అసభ్యకర కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్ (VIDEO)

రేణూ దేశాయ్‌పై అసభ్యకర కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్ (VIDEO)

సినిమా రంగానికి దూరంగా ఉంటూ సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్న రేణూ దేశాయ్, సోషల్ మీడియా వేదికను సమాజపరమైన అంశాలను చర్చించేందుకు ఉపయోగిస్తున్నారు. మూగజీవాల సంరక్షణ, వీధి జంతువుల భద్రత, ఇతర సామాజిక అంశాలపై ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని వీధి కుక్కలపై దాడులు పెరిగిన సందర్భంలో రేణూ దేశాయ్ స్పందించారు. “అన్ని కుక్కలు ప్రమాదకరం కావు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు లేదా మా స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వండి, మేమే వాటిని చూసుకుంటాం” అని సూచించారు.

కానీ, ఆమె వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించి, రేణూ దేశాయ్ మరియు ఆమె పిల్లలపై అనవసరమైన, అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఈ వేధింపులను తట్టుకోలేకపోయిన రేణూ దేశాయ్ హైదరాబాద్ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి, మరికొందరిని గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు పేర్కొన్నారు.

రేణూ దేశాయ్ పోలీసులు చేసిన చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. “అరెస్టయిన వారు పోలీసులు విచారించినప్పుడు.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి తిట్టితే ఫేమస్ అవుతామని అనుకున్నారు. కేవలం సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఇలాంటి నీచమైన పనులు చేయడం విచారకరం. ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని రక్షించడం కూడా ముఖ్యమే. బూతులు తిట్టి, అనవసరంగా మీ జీవితాలను నాశనం చేయవద్దు. అరెస్ట్ అయితే మీ ఫ్యామిలీ పేరుపై ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా కష్టపడతాయి. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లేదా ప్రైవేట్ కంపెనీల్లో ఉంటే.. మీ కంపెనీ హెచ్ఆర్‌లకు ఫిర్యాదు వస్తే మీ కెరీర్ నష్టపోతుంది. మీరు ఉచిత ప్రచారం కోసం ఇలాంటి పనులు చేయవద్దు. అరెస్ట్ చేసిన వారి వివరాలను బయటకు తీసి ప్రాచుర్యం ఇవ్వాలని మా ఉద్దేశ్యం కాదు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసైతే అది జీవితాంతం బ్లాక్ మార్క్‌లా ఉంటుంది. సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఫేమస్ కావాలనేవారికి ఆరుగురి అరెస్ట్ గుణపాఠం అవ్వాలి” అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికపై బాగా వైరల్ అవుతోంది.

ALSO READ: యుద్దం ఎఫెక్ట్.. పెరగనున్న మద్యం ధరలు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు