Wednesday, March 11, 2026
Homeక్రైమ్రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ కోటి సింగ్ కు చార్జి మేమో జారీ

రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ కోటి సింగ్ కు చార్జి మేమో జారీ

నల్గొండ జిల్లాలో పోలీసులు రెచ్చిపోతున్నారు. జనాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గుర్రంపోడులో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సీఐ, ఎస్ఐలపై వేటు పడింది. తాజాగా మునుగోడు ఏఎస్ఐ రెచ్చిపోయాడు. కొమ్ము ముత్యాలు అనే రైతుపై దాడి చేశాడు. వద్దని ప్రాదేపడుతున్నా వినకుండా కొట్టాడు. రైతును ఏఎస్ఐ కొడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మునుగోడులో ఇద్దరు రైతుల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ కోసం వచ్చిన ఏఎస్ఐ.. రైతును పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లడానికి వచ్చాడు. అయితే పొలం పనులు ముగించుకుని వస్తానని ప్రాధేయపడ్డాడు రైతు ముత్యాలు. వినకుండా ఏఎస్ఐ రైతుపై దాడికి పాల్పడ్డాడు. అందరి ముందు రైతును చితకబాదాడు మునుగోడు ఏఎస్ఐ కోఠిసింగ్

మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్ము ముత్యాలు అనే రైతు పైన ఏ ఎస్సై కోటి సింగ్ చెయ్యి చేసుకున్న ఘటనలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ డీఎస్పీ కే శివరామిరెడ్డి నీ విచారణకు ఆదేశించారు.విచారణ అనంతరం ఏ.యస్.ఐ కోటి సింగ్ కు నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి ఛార్జ్ మెమో జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments