గుప్తనిధుల పేరుతో ఓ వ్యక్తిని నమ్మించి కంకర రాళ్లను బంగారం అంటూ విక్రయించి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బంగారం దొరికిందని చెప్పి నకిలీ రాళ్లను ఇచ్చి లక్షల రూపాయలు తీసుకున్న ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. రమేష్ అనే వ్యక్తి శ్రీనివాస్ వద్ద రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని శ్రీనివాస్ ఒత్తిడి చేయడంతో ఓ పథకం వేసినట్లు తెలుస్తోంది. తనకు గుప్తనిధులు లభించాయని, అందులో బంగారం ఉన్న రాళ్లు ఉన్నాయని రమేష్‌ను నమ్మించాడు.
బంగారు రంగు పూత పూసిన కంకర రాళ్లను బంగారంగా చూపించి రమేష్‌కు అప్పగించాడు. ఈ క్రమంలో అదనంగా రూ.32 వేలు తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. నాలుగు కుండల్లో నాలుగు రాళ్లు పెట్టి ఇచ్చినట్లు తెలిపాడు.
కొంతకాలం తర్వాత అవి అసలు బంగారం కాదని, కేవలం కంకర రాళ్లకు రంగు వేసినవని తెలుసుకున్న రమేష్ మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో శుక్రవారం డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
also read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక 10 రోజుల్లోనే ఎడ్యుకేషన్ లోన్! బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు
