Homeలైఫ్ స్టైల్ఈ చిన్న తప్పులే మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..?

ఈ చిన్న తప్పులే మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈరోజుల్లో గుండె జబ్బులు కారణంగా ఎంతో మంది ప్రజలు క్షణాల్లోనే మరణిస్తున్నారు. నిత్యం ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఇటువంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాము. అయితే గుండె జబ్బులు రావడానికి ఎన్నో విధాల కారణాలు ఉన్నాయి. ఈ గుండె జబ్బులు కేవలం ఒక్కరోజులో వచ్చేవి మాత్రమే అయితే కావు అని డాక్టర్లు తేల్చి చెప్పారు. మనం మన జీవితంలో చేసేటువంటి ప్రతి పనిలోనూ ఈ గుండె జబ్బుకు కారణం అయ్యి ఉండవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. స్మోకింగ్ చేస్తే రక్తనాళాలు దెబ్బతింటాయి. అలాగే గంటలు తరబడి ఒకచోటే కూర్చుంటే మెటబాలిజం మందగిస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు నిద్రపోకుండా, ఎక్కువ ఒత్తిడి కారణంగానూ గుండెపై ఎక్కువ భారాన్ని పెంచుతూ ఉంటాయి. ఇక ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆక్సిడేటివ్ ఇవన్నీ కూడా దారితీస్తుంటాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్ మన గుండె జబ్బులకు కారణాలు అవుతాయి. ప్రతిరోజు ఏదో ఒక విధంగానూ దీర్ఘకాలంలో గుండెపై ఒత్తిడి పెంచి హార్ట్ ఎటాక్ అలాగే స్ట్రోక్ రూపంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా ఏ అనారోగ్యానికి దారి తీస్తుంది అనేది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. లేదంటే అతి తక్కువ సమయంలోనే గుండె జబ్బులకు బలైపోవాల్సి వస్తుంది.

పెట్రోల్ లేదంటూ తరచూ మూసివేత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

స‌మ్మ‌ర్‌లో ఇవి స్పెష‌ల్‌….ఇవి తింటే శ‌రీరం ఐస్ కావాల్సిందే…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు