Homeతెలంగాణతెలంగాణ అసెంబ్లీ వాయిదా...!

తెలంగాణ అసెంబ్లీ వాయిదా…!

వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే 10,000 కట్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు జరిగిన అనంతరం మార్చి 30, 2026న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 బిల్లుల్లో 10 కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 10 పనిదినాల్లో మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సభ సాగింది. బడ్జెట్ వ్యయాలకు సంబంధించి ఈ కీలక బిల్లుకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026 ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికుల సామాజిక భద్రత కోసం దీనిని రూపొందించారు.

న్యాయవాదుల రక్షణ బిల్లు 2026 న్యాయవాదుల భద్రత కోసం చట్టం చేశారు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి 15% లేదా ₹10,000 కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు ఇచ్చేలా నిబంధనలు చేర్చారు. ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక బిల్లు (Hate Speech Bill) ఆన్‌లైన్ లేదా బహిరంగ వేదికలపై విద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ఒక బిల్లును మరింత అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపారు. అలాగే, మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. చివరి రోజు బడ్జెట్ గ్రాంట్లపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు