Homeతెలంగాణయరగండ్లపల్లి: ముగిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..!

యరగండ్లపల్లి: ముగిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..!

మర్రిగూడ,(క్రైమ్ మిర్రర్): మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో, గత ఐదు రోజులుగా అత్యంత వేడుకగా జరుగుతున్న, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు సోమవారం నాటి రథోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా, గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ​గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయని సర్పంచ్ సంతోష్ యాదవ్ అన్నారు. ఈ నెల 26న ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 29 ఆదివారం రోజున రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు, అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

నేడు ఉదయం 7 గంటలకు స్వామి వారి రథోత్సవం అట్టహాసంగా సాగిందన్నారు. రథోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజలు అహర్నిశలు శ్రమించి, ఈ వేడుకలను విజయవంతం చేశారని, సర్పంచ్ సంతోష్ యాదవ్ వారిని కొనియాడారు. స్వామి వారి కృపతో గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మంచన హరిబాబు శర్మ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు