Wednesday, March 25, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై గెలిచామంటూ ట్రంప్ ట్వీట్‌...

ఇరాన్‌పై గెలిచామంటూ ట్రంప్ ట్వీట్‌…

  • ఎప్ప‌టికీ ఇరాన్ అణ్వాయుధాలు త‌యారు చేయ‌లేదు…

  • సైనిక‌ప‌రంగా అంత‌మొందించాం…

 

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌ : ఇరాన్‌తో జ‌రుగుతున్న యుద్దంలో మేము గెలిచామంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ యుద్దంలో సైనిక‌ప‌రంగా అంత‌మొందించామ‌ని తెలిపారు. ఇరాన్ ఎప్ప‌టికి అణ్వాయుధాలు త‌యారు చేయకూడ‌ద‌నేదే మా ష‌ర‌తు అని తెలిపారు. ఇరాన్‌తో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి ఆ దేశం ఎదురు చూస్తోంద‌ని తెలిపారు.

నౌకాద‌ళం, వైమానిక ద‌ళం పూర్తిగా ద్వంసం చేశామ‌ని తెలిపారు. అమెరికా యుద్ద‌విమానాలు సిద్దంగా ఉన్నాయ‌ని చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే అమెరికా ఏదైనా చేయ‌గ‌ల‌ద‌ని ట్రంప్ తెలిపారు.మరోవైపు ఇరాన్.. అమెరికాకు హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. అయితే.. ఆ బహుమతి ఏంటనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

అమెరికాతో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రుప‌లేదు…

అమెరికాతో ఇరాన్ నేత‌లు ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రుప‌లేద‌ని ట్రంప్ చెప్పే మాట‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఈజిప్ట్‌, ట‌ర్కీ, పాకిస్థాన్ వంటి దేశాల‌తో ఇరాన్ క‌లిసి అమెరికాతో మ‌ద్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. కాగా మ‌రోవైపై సౌది అరేబియా యువ రాజు మ‌హ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ ఇరాన్‌పై దాడులు కొన‌సాగించాల‌ని అమెరికాను కోరిన‌ట్లు తెలిసింది.

ఒక‌వైపు శాంతి మంత్రం…మ‌రొ వైపు దాడులు…

ఐదు రోజులు యుద్దానికి విరామం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ గ‌ల్ఫ్ దేశాల్లో ఇంకా యుద్దం కొన‌సాగుతూనే ఉంది. సౌది అరేయి బాలిస్టిక్ క్షిప‌ణి ఇరాన్‌కు చెందిన 6 డ్రోన్‌ల‌ను కూల్చివేసింది. తూర్పు ప్రావిన్సులో తమ వాయు రక్షణ వ్యవస్థ ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌, కువైట్ దేశాల‌పైన ఇరాన్ దాడులు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments