Homeక్రీడలురింకూ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్!

రింకూ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క జట్టు కూడా ప్రాక్టీస్ ప్రారంభించి ఈసారి ట్రోఫీ నెగ్గెందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రతి జట్టు కూడా ఎంతో బలమైన జట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సమ్మర్ ఐపిఎల్ వినోదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సీజన్ ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండగా ఈ లోపే ఆయా జట్లు కొన్ని గుడ్ న్యూస్ లు చెబుతూ ఉన్నాయి. ఇక తాజాగా కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులోని స్టార్ ప్లేయర్ గా ఉన్నటువంటి రింకు సింగ్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ తో రహనే కెప్టెన్సీగా కొనసాగుతుండగా రింకు అతనికి డిప్యూటీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. మినీ వేలంలో ఆర్సిబి జట్టుకు వెంకటేష్ అయ్యర్ వెళ్లిపోవడంతో అతని స్థానం రింకు సింగ్ భర్తీ చేయబోతున్నారు అని తాజాగా జట్టు యాజమాన్యం తెలిపింది. దీంతో కేవలం ఒక ఫినిషర్ గా మాత్రమే కాకుండా టీం లీడర్ గా కూడా రింకును ఎదిగే విధంగా జట్టు చూస్తుంది అని అర్థమవుతుంది. కాగా ఈ మధ్యనే రింకు సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చిన విషయం తెలిసిందే. అలాగే వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో తన తండ్రి మృతి చెందిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

ఇది భారత్ పవర్.. మన దేశాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి : ప్రధాని మోదీ

అలెర్ట్!.. 3 రోజులు పాటు పిడుగులతో కూడిన వర్షాలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు