క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా పెట్రోలు బంకులు మూసివేశారు. డీజిల్ మరియు పెట్రోల్ వంటివి తక్కువగా సరఫరా అవుతున్న నేపథ్యంలో కాస్త ఇబ్బందిగా మారడంతో చాలామంది ఇప్పటినుంచే పెట్రోల్ బంకులకు క్యూ కడుతూ ఎక్కువ మోతాదులో వీటిని కొనుగోలు చేస్తున్నారు. కానీ హైదరాబాదులో ఏకంగా పెట్రోల్ బంకులు మూతపడడం వాహనదారులను పూర్తిగా ఆందోళనకు గురిచేస్తుంది. పైన యుద్ధం కారణంగా పెట్రోల్ అలాగే డీజిల్ దొరకదేమోనని భయంతో ఎక్కడ పెట్రోల్ బంకు కనిపిస్తే అక్కడికి క్యూ కట్టి పెద్ద మొత్తంలో రద్దీని సృష్టిస్తున్నారు. అయితే పెట్రోల్ బంకులు మూసి వేయడానికి పలు కారణాలు ఉన్నాయి. గతంలో క్రెడిట్ పద్ధతిలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను డైరెక్ట్ గా బంకులకు సరఫరా చేసేవారు. కానీ నేడు ఇటువంటి సిట్యూవేషన్ లో ఖచ్చితంగా నగదు ఇస్తేనే ఇంధనాన్ని సరఫరా చేస్తాము అంటూ కొత్త మెలిక పెట్టడంతో చాలానే పెట్రోల్ బంకులు మూసివేయడానికి కారణమయ్యాయి. చాలామంది డీలర్ల చేతిలో నగదు లేకపోవడంతో ఈ పెట్రోల్ మరియు డీజిల్ కొనడం కొన్ని రోజులపాటు ఆపేశారు. మరోవైపు ప్రతి కుటుంబంలో సిలిండర్ సమస్య కూడా ఇదే విధంగా ఉంది. ఈరోజు గ్యాస్ సిలిండర్ కావాలి అంటే కచ్చితంగా కొన్ని గంటలపాటు వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో కేంద్రం ఈ సమస్యలపై దృష్టి సారించి కొత్త విధానాలను ఏమైనా అమలు చేయాలి అని ప్రజలు కోరుతున్నారు.
క్రమంగా ఆవిరైపోతున్న బంగారం,వెండి ధరల లాభాలు?
Poolabala’s Indian Sonnets: పూలబాల ‘ఇండియన్ సోనెటీర్’.. షేక్ స్పియర్ ను మించిన రచన!
