Homeఆంధ్ర ప్రదేశ్YSRCP Strategy: వైసిపి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్, పాత సన్నిహితుడినే ఆశ్రయించిన జగన్!

YSRCP Strategy: వైసిపి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్, పాత సన్నిహితుడినే ఆశ్రయించిన జగన్!

* ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం

* త్వరలో రంగంలోకి పీకే

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు. వ్యూహాలు పనిచేయడం లేదు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. జాతీయస్థాయిలో వేరుమోసిన వ్యూహకర్తలను ఆశ్రయించారు. అయితే వారంతా సోషల్ మీడియా స్ట్రాటజిస్టులే కానీ.. తన పార్టీకి తగ్గ వ్యూహాలు అమలు చేయలేరని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఒకప్పటి తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు సేవలందించిన రుషిరాజ్ సింగ్ కు కాదని కొత్తవారిని ఎంపిక చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

తనకంటూ ఒక ముద్ర..

ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యూహకర్తగా తొలిసారిగా వ్యవహరించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ 2014లో అధికారంలోకి వచ్చేందుకు తన సేవలు అందించారు. అటు తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి సైతం రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించారు. గెలిచేందుకు విలువైన సూచనలు అందించగలిగారు. దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలకు గెలుపు కోసం అవసరమైన సలహాలు సూచనలు అందించడంలో ముందంజలో నిలిచారు ప్రశాంత్ కిషోర్. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో ఫెయిలయ్యారు. మరికొన్ని చోట్ల సక్సెస్ అయ్యారు. అయితే దేశంలో వ్యూహకర్తల వ్యవస్థలో మాత్రం ముందంజలో నిలిచారు ప్రశాంత్ కిషోర్.

గతంలో జగన్ పాదయాత్ర సమయంలో..

2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ సమయంలోనే దేశంలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సేవలందిస్తూ వచ్చారు ప్రశాంత్ కిషోర్. తన ఐపాక్ టీం తో రాజకీయ వ్యూహాలను అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ ను జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు. వారి మధ్య ఒప్పందం కూడా జరిగింది. 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. సన్నాహక సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు జగన్ మోహన్ రెడ్డి. అలా 2019 ఎన్నికల్లో వ్యూహాలను అందించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు నడిపించారు ప్రశాంత్ కిషోర్. కానీ 2019 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ను వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్లపాటు రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐప్యాడ్ సేవలందించింది. కానీ 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమిని తప్పించలేకపోయారు.

రాజకీయాల వైపు వెళ్ళినా..

ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త కొలువును వదులుకొని బీహార్లో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అక్కడ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ పార్టీని ఆదరించలేదు. తిరిగి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మారిపోతారని ప్రచారం ప్రారంభం అయింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. సరైన ప్యాకేజ్ ఇస్తే మరోసారి సేవలందించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

1 COMMENT

  1. ఏపీ రాజకీయాల్లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు… పీకే రాకతో వైఎస్ జగన్ లో మార్పు వచ్చేనా..?

Comments are closed.

తాజావార్తలు