Monday, March 16, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఎదుగుద‌ల ఓర్వ‌లేక‌నే రాజ‌కీయ దాడి...? తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌

ఎదుగుద‌ల ఓర్వ‌లేక‌నే రాజ‌కీయ దాడి…? తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌

  • డ్రగ్స్ కేసు వెనుక రాజకీయ వ్యూహం ప్రత్యర్థుల పనేనా?

  • కొలిక్కిరాని కాల్పుల వ్య‌వ‌హారం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:  ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై కుట్ర జరుగుతోందా? డ్రగ్స్ కేసులో పక్కా వ్యూహం ప్రకారమే ఆయనను ఇరికించారా? ఇందులో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర దాగి ఉందా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ శివారు మోయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ఈగల్ టీం నిర్వహించిన ఆకస్మిక దాడిలో పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు.

ఈ కేసులో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అసలు నిందితులను పక్కనపెట్టి.. పుట్ట మహేష్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయ దాడి జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం…

ఈ డ్రగ్స్ కలకలానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం నమోదయింది. ఈ ఘటనలో పట్టుబడిన వారందరికీ మొదట డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు మరో నలుగురికి డ్రగ్స్ వినియోగానికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే పుట్టా మహేష్ యాదవ్ విషయంలో మాత్రం నెగిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే వ్యక్తికి గంటల వ్యవధిలో ఫలితాలు మారడం వెనుక ఏముంది అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది సహజంగా జరిగిన పరిణామమా? దీని వెనుక గ్రూప్ దేశం ఏమైనా ఉందా అనే అంశంపై లోపే నాకు చర్చ నడుస్తోంది.

ఎదుగుదల సహించలేక…

పుట్టా మహేష్ యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. బీసీల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు. ఇటీవలే ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ సభ్యుడిగా అభివృద్ధిని చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. అపరిస్కృత సమస్యలపై సైతం దృష్టిపెట్టారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆయన ఎదుగుదలను సహించలేక.. రాజకీయ ప్రత్యర్థులు ఈ డ్రగ్స్ కేసును ఆయుధంగా ఉపయోగించి ఆయనపై ముద్ర వేయాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కీలక అంశాలు సైతం…

ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఫామ్ హౌస్ లో కాల్పులు జరిగాయని సమాచారం రావడం, పైలెట్ రోహిత్ రెడ్డి పిఎ తన ఫోన్ ను పగులగొట్టి ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వినిపించడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ అంశాలపై పెద్దగా చర్చ జరగకపోవడం, కేవలం మహేష్ యాదవ్ పేరు మాత్రమే ప్రధానంగా ప్రచారంలోకి రావడం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పక్కా రాజకీయ వ్యూహంతో చేసిన పనిగా అనుమానం వ్యక్తం అవుతుంది. మరి ఏం జరిగిందో ఆ దేవుడికే ఎరుక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments