Monday, March 16, 2026
Homeజాతీయంఐదు రాష్ట్రాల్లో మ్రోగిన ఎన్నిక‌ల న‌గారా...! అంద‌రి క‌ళ్లు అస్సాం పైనే...

ఐదు రాష్ట్రాల్లో మ్రోగిన ఎన్నిక‌ల న‌గారా…! అంద‌రి క‌ళ్లు అస్సాం పైనే…

  • త‌మిళ‌నాడులో త్రిముఖ పోటి

  • జాతీయ పార్టీల పాత్ర నామమాత్రం

  • ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ

క్రైమ్ మిర్రర్, ఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల న‌గార మ్రోగింది. జాతీయ స్థాయి ఎన్నిక‌లు కావ‌డంతో అంద‌రి చూపు ఈ ఎన్నిక‌ల‌పైనే ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. నడి వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనున్నాయి ఈ ఎన్నికలు. బిజెపి వర్సెస్ కాంగ్రెస్ కాకుండా.. ఎన్డీఏ వర్సెస్ కూటమి అన్నట్టు ఈ ఎన్నికలు ఉండనున్నాయి. ఎన్డీఏ హవాకు చెక్ పెడుతూ ఇండియా కూటమి సత్తా చాటుతుందో? లేకుంటే ఎన్డీఏ విజయ పరంపర కొనసాగుతుందో? ఎన్నికలు తేల్చేయనున్నాయి.

మోడీ వర్సెస్ దీదీ …

పశ్చిమ బెంగాల్ లో బిజెపి వర్సెస్ టీఎంసీ.. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ కూటములు.. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉంది. అయితే ఒక్క అస్సాంలో మాత్రమే కాంగ్రెస్, బిజెపి ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ప్రభుత్వాల మార్పునకు మాత్రమే పరిమితం కాకుండా కేంద్ర రాజకీయాల్లోనూ మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఏ మేరకు రామిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్లో మరోసారి మమతా వర్సెస్ మోడీ అన్నట్టు మారింది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన పదేళ్ల సంక్షేమ పథకాలు, బెంగాలీ అస్మితను నమ్ముకుంది. బిజెపి మాత్రం రుణమూల్ కాంగ్రెస్ అవినీతి, ప్రజల అసంతృప్తిని ప్రధాన అస్త్రాలుగా చేసుకుంది. గత ఎన్నికల కంటే ఈసారి బిజెపి పదునైన వ్యూహాలతో అడుగులు వేస్తోంది. దీంతో బెంగాల్లో ఊరు ప్రతిష్టాత్మకంగా మారనుంది. చిన్న పార్టీ ఓట్ల చీలిక కూడా అక్కడ ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

తమిళనాడులో రసవత్తరం…

తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడ అధికార డిఎంకె కూటమి బలంగా ఉంది. అయితే మధ్యలో సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం చేయడంతో.. ఆయన ఎవరు ఓట్లు చీల్చుతారు అనేది ఆధారపడి ఉంటుంది గెలుపు ఓటములపై. విజయ్ ఎంట్రీ తో తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. అన్నా డీఎంకే తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది.

విజయ్ వైపు యువత మల్లుతున్నారు. దీంతో ఎవరికి గండి పడుతుందోనన్న అనుమానాలు ఉన్నాయి. పుదుచ్చేరిలో సైతం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అక్కడ కూడా కూటముల పోరు కొనసాగుతోంది. అయితే ఇక్కడ జాతీయ పార్టీలు నామమాత్రం అయ్యాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, అన్నా డీఎంకే కూటమిలో బిజెపి ఉన్నాయి. దీంతో ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టంగా మారుతోంది.

హ్యాట్రిక్ దిశగా ఎల్డిఎఫ్…

కేరళలో మాత్రం విచిత్రకర పరిస్థితి ఉంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇక్కడ ప్రభుత్వం మారుతూ ఉంటుంది. కానీ గడచిన ఎన్నికల్లో పినరాయి విజియన్ ఆ సెంటిమెంట్ ను చెరిపేశారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది ఇక్కడ ఎల్డిఎఫ్. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోనే పిడిఎఫ్ సైతం గట్టిగానే తలపడుతోంది. భారతీయ జనతా పార్టీ మూడో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. త్రిముఖ పోటీలో అభ్యర్థుల గెలుపు అనేది ప్రతిష్టాత్మకంగా మారింది.

అస్సాంలో ప్రధాన పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్య ఉంది. సీఎం హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ధీమాగా ఉంది. మహాజోత్ కూటమి విచ్ఛిన్నం కావడం ఇక్కడ కలిసి వచ్చే అంశం బిజెపికి. కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగాయి తన వ్యక్తిగత చరిష్మాతో బిజెపికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ హిందుత్వ కార్డుతో బిజెపి పై చేయి సాధించాలన్న ప్రయత్నంలో ఉంది. అది కొంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments