మూసీ భూముల అక్రమణ పథకం
మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల భూములపై రేవంత్‌రెడ్డి కన్ను
మూసిని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్
కాంగ్రెస్ ముక్కు నేలకి రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి తన పాపం కడుక్కొవాలి
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్
గండిపేట (క్రైమ్ మిర్రర్): కాంగ్రెస్‌ది మూసీ సుందరీకరణ కాదు మూసీ భూముల అక్రమణ పథకం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. హిమాయత్‌సాగర్‌లో శనివారం సాయంత్రం మూసీ పునరుజ్జీవం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 16 వేల కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివద్ది చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల మేర విజయవంతంగా అభివద్ధిశామని వివరించారు. అయితే ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతుందని ఆయన విమర్శించారు. ఎలాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ ఎనిర్వాన్‌మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేధికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేల మంది ఇండ్లను కూలగొడతామని భయబ్రాంతులకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం భూసేకరణ చట్టాలను, ఇతర నిబంధనలను అన్నింటిని పాతర వేసి వేల కోట్ల అవినీతికి తెలగబడుతుందన్నారు. అభివద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు అని అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహానికి రేవంత్‌రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకమని కేటిఆర్ అన్నారు. ఖచ్చితంగా రేవంత్‌రెడ్డి అవినీతిని అడ్డుకుంటాము పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పనంగా పెట్టి వందల ఉద్యమాలు చేసి సాధించుకన్న భూమి పుత్రులుగా, కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామని తెలిపారు. బాధితుల వెంట ఖచ్చితంగా భారత రాష్ట సమితి ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ప్రాంతానికి పార్టీ నేతలు పార్టీ శ్రేణులు వచ్చి మరి నిలబడతామన్నారు. ఒక రెండు సంవత్సరాల పాటు మూసి బాధితులు సమిష్టిగా కలిసికట్టుగా ప్రభుత్వం పైన పోరాడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజ్యాన్ని పారదొలి ప్రతి ఒక్కరి ఇళ్లను భూములను కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలకు అభివద్ధికి డబులు లేవు,విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్‌రెడ్డి మూసి కోసం వేల కోట్లు ఖర్చు పెడితా అంటున్నారన్నారు. లక్షన్నర కోట్ల రూపాయలతో మూసిని అభివద్ధి చేస్తామంటున్నారన్నారు. అందాల పోటీలకు పుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్‌రెడ్డి తీరు తయారైందన్నారు. గత ప్రభుత్వంలో కేసిఆర్ పిపిటి ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే రేవంత్‌రెడ్డి పిపిటి ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కొవాలి అనే విద్వంసం గురించి పిపిటి ఇచ్చారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్స్ రేవంత్‌రెడ్డి పిపిటి ఇస్తే, మూసీని ఎలా అభివద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన ఈరోజు మేము వివరిస్తున్నామన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా గత ప్రభుత్వ ఆరు కిలోమీటర్ల మూసిని విజయవంతంగా అభివద్ధి చేసిందన్నారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. దశాబ్ధాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగా మూసి సర్వనాశనం అయిందన్నారు. గతంలో మూసిని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోండి అన్నారు. నమాని గంగేకి ఖర్చు 42 వేల కోట్లు వందల కిలోమీటర్ల నమామి గంగేకి ఖర్చు కేవలం 42 వేల కోట్లు అయితే, 55 కిలోమీటర్ల మూసికి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చువుతుందనే మా ప్రశ్నకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసి అభివద్ధిని ఏమాత్రం అడ్డుకోమన్నారు. కానీ కేవలం మూసీ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుండా మూసీ పక్కన ఉన్న భూముల కోసం పని చేస్తున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి స్వయంగా రియల్ ఎస్టేట్ వాఆ్యపారం చేస్తే తప్పేమిటి అని అంటున్నారన్నారు. గాంధీ విగ్రహం పెడతా అంటున్న రేవంత్‌రెడ్డి గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడి చేయవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఎవరు అడ్డుకోవద్దని మహాత్మాగాంధీ విగ్రహాన్ని రేవంత్‌రెడ్డి పెట్టే కుట్ర చేస్తున్నాడన్నారు. మూసీ అంశంలో మా పార్టీది మానవీయ కోణంలో అభివద్ధి చేసే కార్యక్రమం అన్నారు. మేము మూసీకి ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా నాగోల్ వద్ద అభివద్ధి చేశామన్నారు. దీంతో పాటు బేగంపేట, గండిపేట వంటి అనేకచోట్ల అభివద్ధి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ మాదిరి ప్రచార చేసుకోలేకపోయామన్నారు. కానీ ఎలాంటి పని చేయకుండానే మూసీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోగులగా ప్రచారం చేసుకుంటుందన్నారు. ప్రజల ఇళ్లను కూగొట్టాలని మా పార్టీ ఏనాడు మూసీ అభివద్ధి ప్రణాళికలో భావించలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్పరభుత్వం వేల ఇండ్లను కూలగొట్టి మూసీ ప్రణాళికలను తయారు చేసిందన్నారు. ప్రజల ఇండ్లను కూల్చివాటి పునాదుల పైన మూసీ ప్రజెక్టు కట్టడం అన్యాయమన్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత కేసిఆర్ సూచన మేరకు ఇల్లు కూల్చకుండా మూసీని ఎలా అభివద్ధి పరచవచ్చో ప్రయత్నం ప్రారంభించామన్నారు. అందుకే ఒక ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటిషన్ పెట్టి ప్రజలకి నష్టం లేకుండా మూసిని అభివద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పైగా ప్రజలకు నష్టం లేకుండా ఉప్పల్, నాగోల్ ప్రాంతంలో సుమారు ఆరు కిలోమీటర్లు ప్రాంతాన్ని విజయవంతంగా మూసిని అభివద్ధి పరిచామన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మూసీ బాధితులు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలపైన ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సలహాలు సూచనలు ఇచ్చారు.ద శాబ్ధాల నుంచి స్థిరపడి జీవనం సాగిస్తున్న మా బతుకులను ఆగం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉండాలని కోరారన్నారు. ఈ కార్యక్రమంలో విప్ వివేకానందగౌడ్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్, అర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ ఆంజనేయులు, హిమాయత్ సాగర్ మాజీ కార్పొరేటర్ ముద్దం రాము, కోలాన్ సుభాష్ రెడ్డి, ప్రేమ్ గౌడ్, నవీన్, రాముడు యాదవ్, రవీందర్, గంగిని రవి, దుర్గేష్, మణికొండ అధ్యక్షులు సీతారాం దులిపాల, నార్సింగి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్రనగర్ అధ్యక్షులు ధర్మారెడ్డి, కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ కురుమ, మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షులు గుమ్మడి కుమార్, మాజీ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, కొంపల్లి జగదీష్ నేత, ఏర్వ మహేష్ నేత, గంజి రాజు నేత,గుట్టమీది నరేందర్, సుమనలిని, సూర్యం,అశోక్ కురుమ, భాస్కర్ నేత, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Trump: ‘హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి
