Saturday, March 14, 2026
Homeతెలంగాణప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం

రామకృష్ణపూర్,క్రైమ్ మిర్రర్:- పట్టణంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్ టికెట్లు పరిశీలించిన అనంతరం హాలుల్లోకి అనుమతించారు. పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 289 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు.

జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు..! ఎలక్ట్రిక్ వాహనాలనే (EV) వాడాలి..!

ఎగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments