Monday, March 9, 2026
Homeక్రైమ్ACB Raids : ఎల్బీ నగర్‌లో ఏసీబీ వలలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు

ACB Raids : ఎల్బీ నగర్‌లో ఏసీబీ వలలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు

  • సైబర్ క్రైమ్ కేసులో రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ (ఎల్బీ నగర్): ఎల్బీ నగర్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు పట్టుబడ్డారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ప్రమోద్ గౌడ్ మరియు జాతావత్ బాబు నాయక్ లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం, సైబర్ క్రైమ్ కేసులో ఫిర్యాదుదారుడిని అరెస్ట్ చేయకుండా BNSS సెక్షన్ 35 (మునుపటి 41-A Cr.P.C.) కింద నోటీసు జారీ చేయడానికి ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు ఏసీబీ అధికారులను సంప్రదించారు.

ఏసీబీ సిటీ రేంజ్–1 బృందం పర్యవేక్షణలో నిర్వహించిన ట్రాప్‌లో రూ. లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో జాతావత్ బాబు నాయక్‌ను అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కళంకిత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమోద్ గౌడ్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి నాంపల్లి లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదు.

లంచం కోరితే 1064 కు సమాచారం ఇవ్వండి.

ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ప్రజలు వెంటనే ACB టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

ప్రజలు WhatsApp: 9440446106,

Facebook: Telangana ACB,

X (Twitter): @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments