Homeతెలంగాణ10 వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ని పంపిణి..!

10 వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ని పంపిణి..!

  • 10 వ తరగతి లో అధిక మార్కులు సాధించిన వారికి రూ.5 వేలు

  • ద్వితీయ స్థానం లో నిలిచిన వారికీ రూ. 3 వేలు అందిస్తాను

  • సామాజిక వేత్త సిలివేరు యాదగిరి వెల్లడి

యాదాద్రి జిల్లా (క్రైమ్ మిర్రర్): పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సర్వేలు మండలము మాజీ సర్పంచ్ కట్టెల బిక్షపతి, బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ నలపరాజు స్వామి తెలిపారు. సోమవారం యాదాద్రి జిల్లా, నారాయణపురం మండలం, సర్వేలు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిలివేరు యాదగిరి సహకారంతో ఏర్పాటు చేసిన 10 వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ని పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.

10 వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ని పంపిణి..!
10 వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ని పంపిణి..!

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణ తో మెలిగి జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. సిలివేరు యాదగిరి మాట్లాడుతూ.. ఇదే పాఠశాలలో చదువుకుని ఇంత వరకు వచ్చానాని గుర్తు చేశారు. పాఠశాల విద్యార్థులకు సహాయ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని అన్నారు. అదేవిదంగా 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థి కి రూ. 5వేలు, ద్వితీయ స్థానం లో నిలిచిన వారికీ రూ. 3 వేల ను అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, వార్డ్ సభ్యులు బోయ చందు, ఈసం శేఖర్, ఈసం గీతా రామ కృష్ణ, వీరమల్ల నరసింహ, బిఆర్ఎస్వి మునుగోడు ఇంచార్జి నలపరాజు రమేష్, మాజీ వార్డ్ సభ్యులు పగిళ్ల రవీందర్, సీనియర్ నాయకులు కట్టెల మల్లేష్, కట్టెల సత్యం,తెలుకుంట్ల సంజయ్, సుర్వి లింగ స్వామి, సికిలమెట్ల గణేష్, సిలువేరు శంకర్, సికిలమెట్ల రాజు, నాంపల్లి లింగ స్వామి, దుబ్బాక భరత్, సిలివేరు రఘుపతి, పగిళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు