Homeక్రైమ్కూకట్ పల్లి: అక్రమ భవన నిర్మాణం..ఓ మహిళ మృతి

కూకట్ పల్లి: అక్రమ భవన నిర్మాణం..ఓ మహిళ మృతి

  • అక్రమ భవనం నిర్మాణం పై నుండి ఓ మహిళ మృతి..!

  • అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలం

కూకట్ పల్లి, మార్చి 09 (క్రైమ్ మిర్రర్) : అక్రమ భవన నిర్మాణం లో ఓ మహిళ పనిచేస్తుండగా భవనం కిందపడి మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా, నందిగామ మండలం తామరపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి (53) బ్రతుకుతెరువు కోసం కూకట్ పల్లి నియోజకవర్గంలో ని ఏబీవీ పురం లో నివాసముంటు భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తుంది.

గత కొద్ది రోజులుగా అక్రమ భవన నిర్మాణంలో పనిచేస్తూ ఉండేది. కాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భవనం మీద నుండి లిఫ్ట్ గుంతలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

అక్రమ భవన నిర్మాణాలను నియంత్రించడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలం

అక్రమ భవన నిర్మాణాలను తాండ్రంగి అధికారులు నియంత్రిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సెట్ బ్యాక్ లు, సేఫ్టీ మెజర్మెంట్స్, జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అస్బెస్టోస్ కాలనీలో దాదాపు120 గజాల విస్తీర్ణంలో లిఫ్ట్ సైతం నిర్మిస్తున్నారంటే అది అధికారుల అండదండలతోటేనని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అధికారులు సైతం హడావుడి చేస్తూ అనంతరం మీన వేషాలు వేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు