Homeఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం పురోగతి సాధించాలి

రాష్ట్రం పురోగతి సాధించాలి

  • తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న‌ డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

తిరుమల, క్రైమ్ మిర్ర‌ర్: కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మ‌ల్లుభట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య – సాక్షి లకు ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు.

త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, విజన్ 2047లక్ష్యంగా ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని భట్టి విక్రమార్క స్వామివారిని కోరుకున్నారు.

తాజావార్తలు