Homeతెలంగాణఎన్‌సీపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులుగా సట్లపల్లి మహేష్

ఎన్‌సీపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులుగా సట్లపల్లి మహేష్

నిజామాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఎన్‌సీపీ రాష్ట్ర ఓబీసీ అధ్య‌క్షులుగా స‌ట్లప‌ల్లి మ‌హేశ్‌ను నియ‌మిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ జాదవ్, జిమ్మిడి గోపాల్, మేకలశ్రీధర్ లు నియమక పత్రం అంద‌జేశారు.

ఈ సందర్భంగా సట్లపల్లి మహేష్ మాట్లాడుతూ నాపైన నమ్మకంతో నాకు ఎన్సిపి పార్టీ ఓబిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని ప‌ట్ట‌ణంతో పాటు గ్రామ స్తాయిలో తీసుకెళ్తాన‌ని తెలిపారు. పార్టీ బ‌లోపేతానికి త‌న వంతుగా కృషి చేస్తాన‌ని తెలిపారు.

తాజావార్తలు