Homeఆంధ్ర ప్రదేశ్ఏసీబీ వ‌ల‌కు చిక్కిన‌ అవినీతి తిమిలింగం

ఏసీబీ వ‌ల‌కు చిక్కిన‌ అవినీతి తిమిలింగం

అనంతపురం, క్రైమ్ మిర్ర‌ర్: పామిడి స‌బ్ రిజిస్టార్ కార్యాల‌యంలో స‌బ్ రిజిస్ట‌ర్ రాధా ర‌మ‌ణ లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులు చిక్కిన ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో క‌ల‌కలం రేపింది. బాధితుడు ఇంటి రిజిస్ట్రేష‌న్‌కోస‌మ‌ని స‌బ్ రిజిస్టార్‌ను క‌ళిశారు. నీ ప‌ని కావాలంటే డ‌బ్బులు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. చేసేదేమి లేక బాధితుడు ఏసీబీ అదికారుల‌ను సంప్ర‌దించాడు.

కాగా రూ.25వేలను ప్ర‌యివేటు వ్య‌క్తి అయిన వెంక‌టేశ్‌లు తీసుకున్నారు. వెంట‌నే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకోగా నాకు ఏమి తెలియ‌దు స‌బ్ రిజిస్టార్ రాధా ర‌మ‌ణ తీసుకోమ్మ‌న్న‌డు అని చెప్పిన‌ట్లు తెలిపారు. స‌బ్ రిజస్టార్ కార్యాల‌యంలో రాదా ర‌మ‌ణ‌ను డీఎస్‌పీ ప్ర‌సాద్ రెడ్డి, సీఐ హ‌మీద్‌ఖాన్ విచారించారు. రాదార‌మ‌ణ ఇంటిలోకూడ సోదాలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.

తాజావార్తలు