Homeతెలంగాణస్కూల్ బస్సు, బైక్ డీ...ఇద్దరు యూవకులు మృతి

స్కూల్ బస్సు, బైక్ డీ…ఇద్దరు యూవకులు మృతి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: స్కూల్ బస్సు, బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ మండలము చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి

నల్గొండ జిల్లా, నల్గొండ మండలము, చందనపల్లి గ్రామం వద్ద ఉదయం 9.00 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు,ద్విచక్ర వాహనం ఢీకొని బైక్‌ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదంలో మృతులు తుర్కపల్లి (నార్కట్‌పల్లి)కి చెందిన రమేష్ (30), జీ.కొత్తపల్లి (నాగారం)కి చెందిన వంశీ (30) రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు.

ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు