Homeఅంతర్జాతీయంయుద్దం ఎఫెక్ట్‌... శంషాబాద్ లో 10 విమానాలు ర‌ద్దు. - ప్ర‌యాణీకుల ఆందోళ‌న‌

యుద్దం ఎఫెక్ట్‌… శంషాబాద్ లో 10 విమానాలు ర‌ద్దు. – ప్ర‌యాణీకుల ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభం కావ‌డంతో రాజీవ్ గాంధీ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు(శంశాబాద్‌)లో ఆక‌స్మ‌త్తుగా 10 విమానాలు ర‌ద్ద‌య్యాయి. యుద్దం వేళ భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా కొన్ని ఎయిర్‌లైన్స్‌లు తాత్కాలికంగా సేవ‌ల‌ను నిలిపివేశాయి.

స‌ర్వీసులు ర‌ద్దు కావ‌డంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. టిక్కెట్ల రీ షెడ్యూల్‌, రీఫండ్‌, క‌నెక్టింగ్ ఫ్ల‌యిట్ల‌పై అనిశ్చితి నెల‌కొంది. కాగా ఈ సంద‌ర్భంగా విమాన‌శ్ర‌య అధికారులు ప్ర‌యాణీకులు బుక్కు చెసుకున్న త‌మ త‌మ ఎయిర్‌లైన్స్‌ల‌ను సంప్ర‌దించి స‌మాచారం తెలుసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌స్తుత ప‌రిస్తితుల‌ను చూస్తుంటే మ‌రికొన్ని విమాన స‌ర్వీసుల్లో మార్పులు ఉండ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా విదేశి ప్ర‌యాణీకులు బ‌య‌లు దేరే ముందు త‌మ ఫ్లైట్ స్టేట‌స్‌ను త‌ప్ప‌నిస‌రిగా చెక్ చేసుకోవాల‌ని కోరారు. కాగా విమానాలు ర‌ద్దు కావ‌డంతో చేసేదేమి లేక విమానాశ్ర‌యంలో నిరీక్షించాల్సి వ‌స్తుంద‌ని ప‌లువురు ప్ర‌యాణీకులు ఆవేద‌న చెందుతున్నారు.

 

తాజావార్తలు