Homeతెలంగాణపోలింగ్ కేంద్రాల తనిఖీ

పోలింగ్ కేంద్రాల తనిఖీ

డీసీపీ ఎ.భాస్కర్

మంచిర్యాల,క్రైమ్ మిర్ర‌ర్ః మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ ఎ.భాస్కర్ తనిఖీ చేసి, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలింగ్ కేంద్రాల ప‌రిశీల‌న‌
పోలింగ్ కేంద్రాల ప‌రిశీల‌న‌

ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింద‌ని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదన్నారు. ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి విజ్ఞప్తి చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు