HomeజాతీయంRide Services: క్యాబ్స్ లో వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఇవాళ ఆ సర్వీసులు ఉండవట!

Ride Services: క్యాబ్స్ లో వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఇవాళ ఆ సర్వీసులు ఉండవట!

Ride Services Strike Across India: ఓలా, ఊబర్‌, ర్యాపిడో తదితర ప్లాట్‌ఫాంలలో పనిచేస్తున్న బైకులు, ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లు ఇవాళ (ఫిబ్రవరి 7) దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆయా యాప్‌ల ఆధారంగా పని చేస్తున్న డ్రైవర్లు కనీసం ఆరు గంటలపాటు తమ సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు.

కార్మికుల డిమాండ్లు ఏంటంటే?

తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌(టీజీపీడబ్ల్యూయూ) ఇచ్చిన ఈ దేశవ్యాప్త సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కనీస చార్జీలు, మెరుగైన పని పరిస్థితులు, ప్రైవేటు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడడాన్ని నిరోధించాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు.

దేశ వ్యాప్తంగా ప్రయాణీకులపై ఎఫెక్ట్!

ఈ సమ్మె ప్రభావం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆటోలు, క్యాబ్‌లపై ఎక్కువగా ఆధారపడిన నగరాల్లో ఈ ప్రభావం విస్తృతంగా ఉండవచ్చు. ఆయా యాప్‌లపై ఆధారపడి నిత్యం ప్రయాణించేవారు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడే అవకాశముంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు