Tuesday, March 24, 2026
Homeక్రీడలుబాయ్ కాట్ వల్ల భారీ నష్టాలు.. జ్ఞానం లేని పాకిస్తాన్?

బాయ్ కాట్ వల్ల భారీ నష్టాలు.. జ్ఞానం లేని పాకిస్తాన్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్: 2026 T20 వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి 7వ తారీకు నుంచి ఈ టి20 వరల్డ్ కప్ భారత్ మరియు శ్రీలంక వేదికలుగా జరగనుంది. అయితే గత కొద్దిరోజుల నుంచి భారత్ తో జరిగేటువంటి ఫిబ్రవరి 15న మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తాము అంటూ పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. అయితే పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే ఎవరికి లాభం అలాగే ఎవరికి నష్టం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ ఫిబ్రవరి 15న జరగబోయేటువంటి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగకపోతే అది పాకిస్తానికే భారీ నష్టము కానుంది. ఎందుకంటే భారత్ తో బాయ్కాట్ చేస్తే జియో హాట్ స్టార్ కు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఐసీసీ నుంచి ఏడాదికి వచ్చే ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉండవు.

అంతేకాకుండా ఒక మ్యాచ్ ఆడకపోతే ఆ మ్యాచ్ కు సంబంధించిన పాయింట్ లు రావు కాబట్టి ఇతర మ్యాచ్లపై కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే యుఎస్ఏ, నమీబియా మరియు నెదర్స్ లాండ్ మీద పాకిస్తాన్ కచ్చితంగా గెలవాలి. లేదంటే కచ్చితంగా నెట్ రన్ రేట్ పై ఆధార పడాల్సి ఉంటుంది. గతంలో 2024 వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ ను యూఎస్ఏ జట్టు ఓడించింది. ఈ సమయంలోనే మీరు భారత్ వరకు అవసరం లేదు ముందు యుఎస్ఎ మీద నెగ్గి చూపించండి అని భారత దేశ క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ కు కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఒకవేళ బాయ్ కాట్ చేస్తే పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి.

Read also : జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం?

Read also : ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments