Homeఆంధ్ర ప్రదేశ్జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం?

జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ విషయంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు ఇళ్లపై కూటమి నేతలు దాడులు చేసిన తర్వాత ఈ విషయం మరింత చర్చకు దారి తీస్తుంది. ఇక తాజాగా ఈ లడ్డు కల్తీ విషయంపై జంతు కొవ్వు లేదు అని సీట్ రిపోర్ట్ ఇచ్చింది కదా అని ఒక జర్నలిస్ట్ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. అయితే వెంటనే జర్నలిస్ట్ అడిగిన ఆ ప్రశ్నకు సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

నేను మిమ్మల్ని స్ట్రైట్ క్యూస్షన్ అడుగుతున్నాను. జంతువు లేదని రిపోర్టులో ఎక్కడ ఉంది?.. నీకు ఏమైనా రహస్యంగా చెప్పుకొచ్చారా?.. లేక నీకు రాత్రి ఏమైనా కళ వచ్చిందా?.. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ మర్యాదగా చెప్పినప్పుడు వినాలి అంతేగాని నేను నా ఇష్టాను ప్రకారం మాట్లాడుతా, అడ్డుదిడ్డంగా ప్రశ్నిస్తాను అంటే కుదరదు అని.. లడ్డు కల్తీ విషయంపై ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది అని అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాను అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి డిస్కస్ చేయాలి అని.. లేదంటే వీరు ఏమైనా చేయగలరు అంటూ ప్రతిపక్ష పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అని సూచించారు.

Read aslo : జిల్లా పరిధిలోని రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

Read also : Bharat Taxi Launch: అందుబాటులోకి ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు, వీటి ప్రత్యేత ఏంటంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు