Sunday, March 22, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఆటో, టిప్ప‌ర్ ఢీ

ఆటో, టిప్ప‌ర్ ఢీ

  • ఒక‌రు మృతి, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

  • ప‌ది మందికి తీవ్ర‌గాయాలు

కాకినాడ, క్రైం మిర్ర‌ర్ః

కత్తిపూడిలో బుధ‌వారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో లారీని ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఒకరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప‌ది మందికి తీవ్ర గాయాల‌య్యాయి.

స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని శ్రీరాంపురం నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మవరంకు 15 మంది కూలీల‌తో చెట్లు నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు.

ఈ క్ర‌మంలో కత్తిపూడిలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళుతున్న టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో శ్రీరాంపురం గ్రామానికి చెందిన పితాని కామరాజు (65) మృతి చెంద‌గా గాయ‌పడిన వారిని ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించిన‌ట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments