విజయవాడ, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనే సంకేతాలు ఢిల్లీ సర్కిల్స్ నుండి బలంగా వస్తుండటంతో.. కూటమి పార్టీలు ఇప్పటి నుంచే ఒక పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్నాయి. భవిష్యత్తులో పెరగబోయే సీట్ల సర్దుబాటు, ఏ ఏ స్థానాలు ఏ ఏ పార్టీలకు దక్కవచ్చనే ముందస్తు అంచనాలతో.. అత్యంత సెలెక్టివ్‌గా, క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలైన నేతలను మాత్రమే కూటమిలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 14 మంది సీనియర్ సభ్యులతో జాయినింగ్స్ కమిటీ ని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.
Also Read:ఆధార్ కార్డు నుంచి ఎల్పీజీ వరకు.. జులై 1 నుంచి మార్పులివే..
ఈ కమిటీ కేవలం సాధారణ చేరికల కోసం వేసింది కాదని.. పునర్విభజన తర్వాత జనసేన బలంగా పోటీ చేయగల స్థానాలను, అక్కడ ఎదురులేని లీడర్లను ముందే గుర్తించి రిజర్వ్ చేసుకోవడానికేనని క్లియర్ అవుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పుడు తమ్ముళ్ల మధ్య గానీ, కూటమి భాగస్వాముల మధ్య గానీ ఎలాంటి ఈగో క్లాషెస్ రాకుండా, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను మాత్రమే ఫిల్టర్ చేసి పార్టీలోకి ఆహ్వానించే గురుతర బాధ్యతను పవన్ ఈ కమిటీకి అప్పగించారు.ఈ విడత కూటమి చేరికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మహిళా నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలోను, ఇటీవలి కాలంలోనూ ప్రతిపక్ష నేతలు మహిళా ప్రజాప్రతినిధులపై, హోంమంత్రి అనిత వంటి వారిపై చేసిన వ్యక్తిత్వ హనన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళా లోకంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
Also Read:టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఐర్లాండ్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం
ఈ కారణంగాచదువుకున్న, క్లీన్ ఇమేజ్ ఉండి, సమాజంలో గుర్తింపు ఉన్న మహిళా లీడర్లను, విద్యావంతులను పెద్ద ఎత్తున కూటమి వైపు ఆకర్షించడం ద్వారా మహిళా ఓట్ బ్యాంక్‌ను శాశ్వతంగా తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు-పవన్-బీజేపీ త్రయం వ్యూహం రచిస్తోంది.వైఎస్సార్‌సీపీ నుండి బయటకు రావాలని చూస్తున్న కీలక మహిళా నేతలకు, సీనియర్ నేతల కుటుంబసభ్యులకు, సామాజికవేత్తలకు ఈ చేరికల కమిటీ ఒక రెడ్ కార్పెట్ కానుంది. భవిష్యత్తులో సీట్లు పెరిగినప్పుడు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు స్ఫూర్తిని కూడా పరిగణనలోకి తీసుకుని, మహిళలకు మెరుగైన స్థానాలు కేటాయించవచ్చనే భరోసాను కూటమి ఇస్తోంది.
Also Read:అమానుష ఘటన.. మృతదేహాలను ఇంట్లోకి రానివ్వని ఇంటి యజమాని
ఓ వైపు సూపర్ సిక్స్ పథకాలతో మహిళల మనసు గెలుచుకుంటూనే, మరోవైపు రాజకీయంగానూ వారికి పెద్దపీట వేయడం ద్వారా వైఎస్సార్‌సీపీని డిఫెన్స్‌లో పడేయాలనేది పక్కా స్కెచ్. నియోజకవర్గాల పునర్విభజన లెక్కలు.. పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ డైరెక్షన్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మహిళా శకం , సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ మొదలుకాబోతున్నాయని అనుకోవచ్చు.
Also Read:ప్రేయసితో ఏడడుగులు నడిచిన షణ్ముఖ్ జస్వంత్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!