Monday, March 23, 2026
Homeక్రైమ్గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతదేహం

గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతదేహం

  • జిల్లా కేంద్రంలో ఘ‌ట‌న‌
  • ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

కామారెడ్డి,క్రైం మిర్ర‌ర్ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ ఐ చ‌ర్చి స‌మీపంలో గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతి దేహం క‌ల‌క‌లం రేపుతోంది.

వివ‌రాల ప్ర‌కారం గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఒక వ్య‌క్తిని హ‌త్య చేసి ముక్క‌లుగా చేసి ప‌డేశారు. చెత్త ఏరుకునే వారు గోన‌సంచిలో మ‌నిషి కాళ్లు చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని చూడ‌గా గోన సంచిలో న‌డుము నుంచి కాళ్ల వ‌ర‌కు మాత్ర‌మే ఉన్న మృత‌దేహాన్నిగుర్తించారు

మిగితా మృత‌దేహం కోసం వెతికిన దోర‌క‌లేదు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని, మృతుడి వివ‌రాల కోసం ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments