Homeఅంతర్జాతీయంమహాత్మా గాంధీ 78వ వర్ధంతి..దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు

మహాత్మా గాంధీ 78వ వర్ధంతి..దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: జాతిపిత మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా అయన వర్ధంతిని ప్రతి సంవత్సరం జనవరి 30న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 1948 జనవరి 30న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా ఆయన నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు..

గాంధీజీ దేశం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా ఈ రోజును భారతదేశం అంతటా “అమరవీరుల దినోత్సవం” గా పాటిస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా జనవరి 30న ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా రెండు నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటిస్తారు..

ఢిల్లీలోని గాంధీజీ సమాధి అయిన రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ఇతర ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఈ రోజున గాంధీజీకి ఇష్టమైన భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు