Homeతెలంగాణహైకోర్టు తీర్పు: చలానాల పేరుతో వాహనదారులను ఆపి బలవంతం చెయ్యొద్దు

హైకోర్టు తీర్పు: చలానాల పేరుతో వాహనదారులను ఆపి బలవంతం చెయ్యొద్దు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: పోలీసులు కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయాలి తప్ప, వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పెండింగ్‌లో ఉన్న చలానాలను చెల్లించాలని వాహనదారులను రోడ్డుపై ఆపి బలవంతం చేయకూడదని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.

ట్రాఫిక్ నిబంధనల అమలు పేరుతో పోలీసులు వాహనదారులను వేధించకూడదని, వాహనదారుల నుండి బలవంతంగా వాహనాల కీలను తీసుకోవడానికి లేదా వారిని వాహనం దిగమని బలవంతం చేయడానికి పోలీసులకు అధికారం లేదని కోర్టు పేర్కొంది.

వాటిని వసూలు చేయడానికి చట్టబద్ధమైన ఇతర మార్గాలను అనుసరించాలని సూచించింది. పోలీసులు కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయాలి తప్ప, వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని గతంలోనే పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు