Homeతెలంగాణతెలంగాణ హైకోర్టులో 859 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ హైకోర్టులో 859 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు 2026 సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలోని 859 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేసింది.

అర్హులైన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ (tshc.gov.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR)’ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: జనవరి 19, 2026.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 24, 2026.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2026 (రాత్రి 11:59 వరకు).
పరీక్ష తేదీ: ఇంకా ప్రకటించలేదు (ఏప్రిల్ 2026లో ఉండే అవకాశం ఉంది).

పోస్టుల వివరాలు (మొత్తం 859) :
ఆఫీస్ సబార్డినేట్: 319 పోస్టులు.
జూనియర్ అసిస్టెంట్: 159 పోస్టులు.
ప్రాసెస్ సర్వర్: 95 పోస్టులు.
కాపీయిస్ట్: 63 పోస్టులు.
ఫీల్డ్ అసిస్టెంట్: 61 పోస్టులు.
ఎగ్జామినర్: 49 పోస్టులు.
టైపిస్ట్: 42 పోస్టులు.
రికార్డ్ అసిస్టెంట్: 36 పోస్టులు.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III: 35 పోస్టులు.

అర్హత మరియు వయోపరిమితి:
విద్యార్హత: పోస్టును బట్టి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18 నుండి 34 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).

దరఖాస్తు రుసుము:
OC, BC అభ్యర్థులకు: రూ. 600.
SC, ST, EWS, దివ్యాంగులకు: రూ. 400.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు