Homeక్రైమ్దారుణం: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..!

దారుణం: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త దారుణంగా హత్యా చేశాడు.అనుమానమే పెనుభూతమై ఒక నిన్నడు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో చోటు చేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బోరబండలో సైట్‌-3 ప్రాంతంలో రమేష్‌, జ్యోతి దంపతులు కొంతకాలంగా నివాసం వుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపద్యంలో కొన్నిరోజులుగా భార్య ప్రవర్తన పై అనుమానం పెంచుకున్నడు భర్త. గత కొన్ని రోజులగా వారి ఇద్దరు పలుమార్లు గొడవపడినట్లు సమాచారం.

 

భార్య ప్రవర్తన పై అనుమానం పెంచుకున్న భర్త, తన భార్య జ్యోతిపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు రమేష్‌ అక్కడి నుండి పరారయ్యాడు అన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు