Homeతెలంగాణక్రైమ్ మిర్రర్ అప్డేట్: తెలంగాణాలో నేటి ముఖ్యమైన వార్తలు..!

క్రైమ్ మిర్రర్ అప్డేట్: తెలంగాణాలో నేటి ముఖ్యమైన వార్తలు..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో:
స్థానిక సంస్థల ఎన్నికలపై అప్‌డేట్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించే అవకాశం ఉందని, సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయని వార్తలు వస్తున్నాయి.
బెట్టింగ్ యాప్స్ కేసు: బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా నటి శ్రీముఖి, నిధి అగర్వాల్ విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్: అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
విద్యుత్ కోతలు: కొన్ని ప్రాంతాలలో 10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పత్తి కొనుగోలు కేంద్రాలు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు