Homeక్రైమ్CRIME: దావత్‌లో విషాదం.. గొంతులో మటన్ బొక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

CRIME: దావత్‌లో విషాదం.. గొంతులో మటన్ బొక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

CRIME: నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మటన్ బొక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్నందున బుధవారం రాత్రి మేస్త్రీలకు విందు ఏర్పాటు చేశాడు.

ఆ విందుకు తన పొరుగువారైన పోలేముని లక్ష్మయ్యను కూడా ఆహ్వానించాడు. లక్ష్మయ్య విందులో పాల్గొని మద్యం సేవించి మటన్ తింటుండగా, ఒక మటన్ బొక్క అనుకోకుండా గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడ ఉన్నవారు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అతడిని త్వరగా నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడి ప్రాణాలు నిలవలేకపోయాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ALSO READ: Crime: కట్నం కోసం వేధింపులు.. 6 నెలల బిడ్డను చంపి తల్లి సూసైడ్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు