Thursday, March 19, 2026
Homeజాతీయంఅవన్నీ బాధ్యతారహిత వ్యాఖ్యలు, రాహుల్‌ పై ఈసీ తీవ్ర ఆగ్రహం!

అవన్నీ బాధ్యతారహిత వ్యాఖ్యలు, రాహుల్‌ పై ఈసీ తీవ్ర ఆగ్రహం!

Elction Commission On Rahul: బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేయడంపై భారత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. మహారాష్ట్రలో మాదిరిగానే బిహార్‌లోనూ ఓట్ల చోరీ జరుగుతుందన్న రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం,  నిరాధారం, బాధ్యతా రహితమని మండిపడింది. ప్రతిరోజూ వచ్చే ఇలాంటి బెదిరింపులను తాము పట్టించుకోమని తేల్చి చెప్పింది. రాహుల్ వంటి వారు చేస్తున్న బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని తమ అధికారులకు చెప్పామని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా సవరించాలని ఆదేశించామని వెల్లడించింది.

ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ ఏమన్నారంటే?

బీహార్‌ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రాహుల్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని విమర్శించారు. “ఓట్ల చోరీ జరుగుతోంది. దీనికి ఎన్నికల కమిషన్ సహకరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము వాటిని బయటపెడితే, ఈసీ ఏధంగా ఓట్ల చోరీ చేస్తోంది? ఎవరి కోసం చేస్తోందనేది అందరికీ తెలుస్తుంది” అని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఓట్ల చోరీపై స్వతంత్ర విచారణ

బీజేపీ కోసమే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఓట్ల చోరీపై తమ పార్టీ స్వతంత్ర విచారణ జరిపిందన్నారు. ఈ విచారణకు 6 నెలలు పట్టిందన్నారు.  అణుబాంబు లాంటి వివరాలను బయటకు తీశామన్నారు. ఆ బాంబు పేలితే ఎన్నికల సంఘం దాక్కునే అవకాశం ఉందడని రాహుల్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయ్యింది.

Read Also: నిందితులంతా నిర్దోషులే.. మాలేగావ్ కేసులో సంచలన తీర్పు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments