Saturday, March 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్చౌటుప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రకు చెందిన ఇద్దరు డీఎస్పీలు అక్కడిక్కడే మృతి!

చౌటుప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రకు చెందిన ఇద్దరు డీఎస్పీలు అక్కడిక్కడే మృతి!

క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్:- హైదరాబాద్- విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఇద్దరు డీఎప్సీలు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న లారీ.. ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డీఎస్సీ చక్రధరరావు, శాంతారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీకి చెందిన పోలీసు అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న ఏసీపీ పట్టొళ్ల మధుసూదన్ రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని ప్రమాద విషయాన్ని సమీక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు మృతదేహాలను చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సినిమాల్లో మునిగిపోయి.. పర్సనల్ లైఫ్ కోల్పోయా : విజయ్ దేవరకొండ

తిరుపతి జూపార్క్ రోడ్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments